లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి అనుకున్న రేంజ్ ఆదరణ అందుకోలేకపోయింది. దీనితో మెగాస్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచిపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి అయితే డేట్ ని లాక్ చేసుకుంది.
ఈ సినిమా ఓటిటి హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఓటిటి చూద్దాం అనుకునేవారు అయితే ఇప్పుడు ఈ సినిమా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.